Pawan Kalyan: రేషన్ మాఫియా పై చర్యలకు ఉపక్రమిస్తున్న ఏపీ ప్రభుత్వం 20 d ago
రేషన్ మాఫియాపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతుంది. ఏపీ సివిల్ సప్లైస్ శాఖ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనతో రేషన్ మాఫియా అంశం మరింత వేడెక్కింది. డీజీపీతో కలిసి రేషన్ మాఫియాపై చర్యలకు ప్రభుత్వం ప్రణాళిక వేయనుంది. న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం పూర్తిగా పరిశీలిస్తుంది. వేల టన్నుల రేషన్ బియ్యం తరలింపు వెనుక ఎవరున్నారని తేల్చే పనిలో ప్రభుత్వం ఉంది.